అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త కొత్తగా. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. బీజీ గోవిందరాజు సమర్పణలో ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకులు మారుతి, త్రినాథరావు నక్కిన. గోపీనాథ్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ బలమైన కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా సినిమా ఉంటుంది. అబ్బాయికి షేక్‌హ్యాండ్ ఇష్టపడని ఒక అమ్మాయి… ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయికి మధ్య జరిగే ప్రేమకథ ఇది అన్నారు. సమర్పకులు గోవిందరాజు మాట్లాడుతూ కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద చిత్రాల మధ్య మా సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)