Skip to main content

Namaste NRI

కొత్త కొత్తగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

అజయ్‌, వీర్తి  వఘాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కొత్త కొత్తగా.  హనుమాన్‌ వాసంశెట్టి దర్శకుడు. బీజీ గోవిందరాజు సమర్పణలో ఫన్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకులు మారుతి, త్రినాథరావు నక్కిన. గోపీనాథ్‌ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ బలమైన కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తి కలిగించేలా సినిమా ఉంటుంది.  అబ్బాయికి షేక్‌హ్యాండ్‌  ఇష్టపడని ఒక అమ్మాయి… ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయికి  మధ్య జరిగే ప్రేమకథ ఇది అన్నారు. సమర్పకులు గోవిందరాజు మాట్లాడుతూ కంటెంట్‌ మీద నమ్మకంతో పెద్ద చిత్రాల మధ్య మా సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.

Social Share Spread Message

Latest News