Namaste NRI

విదేశాల్లో ఉన్న భారతీయులకు కొత్త నిబంధనలు.. అమెరికా

వ్యాపార అవసరాల నిమిత్తం, విహార యాత్రల కోసం అమెరికా వెళ్లే భారతీయులు వేగంగా వీసా పొందేందుకు ఆ దేశ రాయబార కార్యాలయం కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. బీ1/బీ2 వీసా మీద అమెరికా వెళ్లాలనుకుని విదేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయాల్లో కూడా వీసా అపాయింట్‌మెంట్‌ ను  పొందవచ్చని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈమేరకు  ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో విదేశాల్లో ఉండే భారతీయులు అమెరికా వీసా కోసం భారత్కు రావాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో  నివసిస్తున్న భారతీయులు అమెరికాకు వెళ్లాలనుకుంటే బీ1/బీ2 వీసా అపాయింట్‌మెంట్‌  కోసం భారత్‌కు  రాకుండా బ్యాంకాక్ లోని అమెరికా కాన్సులేట్ లేదా రాయబార కార్యాలయంలో వీసా అపాయింట్ మెంట్ను పొందవచ్చు. భారత్‌లో  అమెరికా వీసా జారీలో నెలకొన్న ఆలస్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Social Share Spread Message

Latest News