కరోనా వైరస్‌లో కొత్త రకం డెల్టా స్ట్రెయిన్ బయటపడిరది. నార్వేలో ఈ కొత్త రకం స్ట్రెయిన్‌ను గుర్తించారు. నార్వేజియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ మేరకు ప్రకటన చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే ఉన్న డెల్టా వేరియంట్‌ల కంటే ప్రమాదకరమైనదేమీ కాదని ఎన్‌ఐపీహెచ్ శాస్త్రవేత్త తెలిపారు. నార్వేలో గత జూన్ చివరిదశలో తొలి డెల్టా వేరియంట్ బయటపడిరదని ఆ తర్వాత అది దేశమంతా వ్యాపించిందని నార్వే నిపుణులు తెలిపారు. ఇప్పుడు తాజాగా గుర్తించిన వేరియంట్ దానికంటే ప్రమాదకరమైనది కాదని అన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్‌లు ఈ కొత్త వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌లు ఈ వేరియంట్‌పై పనిచేయవు అని చెప్పడానికి తగిన ఆధారాలు ఏమీ లేవని తెలిపారు. అంతర్జాతీయంగా ఈ కొత్త డెల్టా వేరియంట్‌ను ఏవై.63గా గుర్తించారు. మొట్టమొదట నార్వేలో గుర్తించినట్లు లేబుల్ చేశారు.














