అమెరికా అధ్యక్ష్య అభ్యర్థి నిక్కీ హేలీ మరోసారి చైనాపై మండిపడ్డారు. కోవిడ్-19 వైరస్ ఆ దేశ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని అమెరికా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ 19 వైరస్ బహుశా చైనా ల్యాబ్ నుంచే వచ్చింది. అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలి. కమ్మూనిస్ట్ దేశమైన చైనాకు ఒక్క సెంట్ కూడా ఇవ్వొద్దు అని అన్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ హేలీ నిలించింది. వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల ప్రచారాన్ని ఆమె ఇప్పటికే ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో ఉన్న కొన్ని దేశాల వైఖరిని ఆమె ఎండగట్టారు.
