Namaste NRI

నితిన్‌ మాచర్ల నియోజకవర్గం ట్రైలర్‌ లాంచ్‌

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 12న విడుదల కానుంది. థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నితిన్‌ మాట్లాడుతూ  మీ ఎనర్జీ చూస్తుంటే ఈ సినిమా విజయం ఖాయమనిపిస్తున్నది. మాస్‌ ఎంటంర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకునే చిత్రమిది. అందరి అంచనాల్ని నిజం చేస్తుందన్నారు. అనంతరం దర్శకుడు అనిల్‌   రావిపూడి మాట్లాడుతూ ట్రైలర్‌ అద్భుతంగా ఉందని, ఈ మధ్య కాలంలో ఇంతటి మాస్‌ యాక్షన్‌ చూడలేన్నారు. కథానాయిక కృతిశెట్టి మాట్లాడుతూ నితిన్‌ ఇరవైయేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీతో ఉన్నారు. ఆయన మంచి మనసు వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్‌ పాత్రలో నటించానని, మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని కేథిరిన్‌ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events