
భాజపా జాతీయ అధ్యక్షుడుగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి నితిన్ నబీన్ తన బాస్ అంటూ ప్రశంసించారు. భాజపా లో సాధారణ కార్యకర్తకూడా జాతీయ అధ్యక్షుడు కాగలరు అన్నారు. భాజపాలో నిర్ణయాలు అన్ని ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయని ప్రజా సేవ, దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తారని సమిష్టి కృషి తోనే మూడుసార్లు అధికారంలోకి వచ్చామని అన్నారు. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా వుందన్నారు. భాజపా కార్యకర్తను అనిపించు కావడమే తనకు గర్వకారణం అన్నారు. భాజపా తోనే దేశం సురక్షితంగా వుందని ప్రజలు భావిస్తున్నారు అని మోది అన్నారు. నితిన్ నబీన్ బిహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు. బిహార్ లోని బంకిపూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
















