Namaste NRI

300 మంది డాన్సర్స్‌తో దుమ్మురేపుతోన్న నితిన్-శ్రీలీల

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్. రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు.   ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో మూడొందలమంది ఫారిన్‌ డాన్సర్లతో జానీ మాస్టర్‌ నేతృత్వంలో పక్కా మాస్‌సాంగ్‌ను శ్రీలీల, నితిన్‌లపై చిత్రీకరిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ  ఇప్పటికే విడుదలైన డేంజర్‌ పిల్లా, బ్రష్‌ వేస్కో పాటలకు అద్భుతమైన స్పందన వస్తున్నది. ఇటీవల విడుదలైన టీజర్‌ కూడా అమేజింగ్‌గా ఉందంటున్నారు. కథ, నితిన్‌ కేరక్టరైజేషన్‌ ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఈ కథకు జూనియర్‌ ఆర్టిస్టే హీరో. సినిమాల్లో నటించే జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ఇందులో నితిన్‌ కనిపిస్తాడు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాటతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. డిసెంబర్‌ 8న సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. డా.రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సుధేవ్‌ నాయర్‌, రావు రమేశ్‌, రోహిణి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events