
బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గురువారం గాంధీమైదాన్‌లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలు ఎన్డీఏ పాలిత రాష్ర్టాల సీఎంలు హాజరయ్యారు. 74 ఏండ్ల నితీశ్‌తో పాటు 26 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వీరిలో 14 మంది బీజేపీ నుంచి, 8 మంది జేడీ(యూ), ఇద్దరు జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
















