పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలతో భారతదేశ సంబంధాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అణు పరీక్షలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ఈ విషయం భారత్‌కు పూర్తిగా తెలుసునని, రహస్య, చట్టవిరుద్ధమైన అణు కార్యకలాపా లు పాకిస్తాన్ చరిత్రలోనే ఓ భాగమని ఆయన విమర్శించారు. స్మగ్లింగ్, ఎగుమతి, ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యా లు తెలిశాయని, ఎప్పటికప్పుడు పాక్ అణు కార్యక్రమాల గురించి అంతర్జాతీయ సమాజానికి చెబుతూనే ఉన్నామన్నారు. పాక్ అణుపరీక్షలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గమనిస్తూనే ఉన్నామన్నారు. ట్రంప్ భారత పర్యటన గురించి చేసిన ప్రకటనపై ప్రశ్నకు సమాధానమిస్తూ ట్రంప్ భారత పర్యటనపై తాను ఏమీ స్పందించలేనని, ఎందుకంటే చెప్పేందుకు తన వద్ద ఏమీ లేదన్నారు. భారత్‌లో ట్రంప్ పర్యటనపై మావద్ద సమాచారం ఏదీ లేదన్నారు.

వైట్‌హౌస్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు బాగా జరుగుతున్నాయ ని, త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నట్లుగా వ్యాఖ్యానించారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించిందని, మోదీ తన స్నేహితుడని, ఇద్దరం మాట్లాడుకుంటున్నామన్నారు. తనను భారత్‌లో పర్యటించాలని మోదీ ఆహ్వానించినట్లుగా తెలిపారు. త్వరలోనే తేదీని నిర్ణయిస్తామని.. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తాను భారత్‌కు వెళ్తానని చెప్పుకొచ్చారు.
















