కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14కు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది. కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సవరణ) బిల్లు-2024ను తీసుకు రాబోతున్నట్టు ప్రకటించింది. ముసాయిదా బిల్లును రాష్ట్ర సర్కార్ సిద్ధం చేయటం ఐటీ రంగంలో కలకలం రేపింది. ఈ ప్రతిపాదనలపై ఐటీ ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నా యి. ప్రభుత్వ చర్య అత్యంత అమానవీయమైందిగా ఐటీ ఉద్యోగుల యూనియన్లు నిరసనకు దిగుతున్నాయి.
రాష్ట్ర ఐటీ, ఐటీ అనుబంధ ఉద్యోగ సంఘం (కేఐటీయూ) ప్రతినిధులు కర్ణాటక కార్మిక మంత్రి సంతోష్‌ను కలుసుకొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఓవర్‌టైమ్‌తో కలుపుకొని గరిష్టంగా రోజులో 10 పనిగంటలు మాత్రమే పని చేయించేందుకు అనుమతి ఉంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో కన్న డిగులకు రిజర్వేషన్లు కల్పిస్తూ సిద్ధరామయ్య సర్కార్ తీసుకొచ్చిన బిల్లుపై ఐటీ రంగం నుంచి తీవ్ర వ్యతిరేక త వ్యక్తమైంది. ఈ బిల్లుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ ఐటీ ఉద్యోగు ల్ని టార్గెట్ చేస్తూ.. మరో బిల్లును తీసుకురావటం చర్చనీయాంశమైంది.