శ్రీ సింహా, నేహా సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం భాగ్ సాలే. ప్రణీత్ సాయి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యశ్ రంగినేని, కళ్యాణ్ సింగనమల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో అర్జున్ అనే పాత్రలో నటించారు శ్రీ సింహా. ఏం చేసైనా సరే అనుకున్నది సాధించాలనుకునే ఓ యువకుడి పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాన్ విజయ్, నందినీ రాయ్ నెగటివ్ రోల్స్‌లో కనిపిస్తారు అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అశ్వత్థామ, గిప్ట్సన్ కొరబండి, కూర్పు :ఆర్. కార్తీక శ్రీనివాస్, ఛాయాగ్రహణం : రమేష్ కుషేందర్.














