
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నూతన భాగస్వామ్య ఒప్పందం పై సంతకం చేశారు. ఇందులో భాగంగా పాశ్చాత్య దేశాల నుంచి తమ రెండు దేశాల్లో ఎవరిపై దాడి జరిగినా పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించారు. 24 ఏండ్ల తర్వాత తొలిసారిగా పుతిన్ ఉత్తరకొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా కిమ్‌కు పుతిన్ రష్యాకు చెందిన లగ్జరీ కారును బహుమానంగా అందజేశారు.
