కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ హమాస్‌పై విరుచుకుపడ్డారు. హమాస్‌కు శాంతి నెలకొల్పడంపై ఆసక్తిలేదని వ్యాఖ్యానించారు. ఇక హమాస్ కథ ముగించాల్సిందేనని పేర్కొన్నారు. గాజాలో దాడులు తీవ్రతరం చేయాలంటూ ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు సూచించారు.

ట్రంప్ మాట్లాడుతూ హమాస్‌కు ఎటువంటి డీల్ చేసుకునేందుకు ఇష్టం లేదు. వాళ్లకు శాంతి నెలకొల్పడంపై ఆసక్తి లేదు. వాళ్లు చావాలని కోరుకుంటున్నట్టు ఉంది. ఇది చాలా దారుణం. ఇక దాని కథ ముగించాల్సిందే. గాజాలో మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలి. ప్రక్షాళన చేయండి. దాడులను ఉద్ధృతం చేయండి అంటూ ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించారు.















