
లండన్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి ప్రపంచంలో ఎనిమిదో ఎత్తైన పర్వతం మౌంట్ మనాస్లు సర్క్యాట్ ట్రెక్ ను విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా తన ఆశయసాధనలో మరో మైలురాయిని చేరుకున్నారు. శేషగిరి సారథ్యం లో పలు దేశాల నుంచి వచ్చిన 10 మంది వైద్యులు, ఇంజినీర్ల బృందం ఇటీవల దాదాపు 177 కి.మీ.ల మనాస్లు సర్క్యాట్ ట్రెక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మనాస్లు మనసు అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించిందన్న శేషగిరి, నేపాల్ మధ్య నుంచి మొదలైన ట్రెక్కింగ్ 14 రోజుల పాటు మంచు పర్వత సానువుల్లో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఓ సవాల్‌గా కొనసాగిందని వివరించారు. డా. గోపీనాథ్ (ఇంగ్లాండ్), డా.అనిల్ ( ఇంగ్లాండ్). గిరీష్ (అమెరికా) డా.అనిత రాణి( అమెరికా), డా. మోహన్ (అమెరికా), డా.సురేష్ (అమెరికా), డా.శ్రీనివాస్ (అమెరికా), సందీప్ (జర్మనీ), డా. రమేష్ (అమెరికా) తో కూడిన బృందం విజయవంతంగా ముగించుకున్న అద్భుతమైన ట్రెక్కింగ్ జర్నీలో అనుభవాలు, అద్భుతమైన జ్ఞాపకాలు అన్నారు.


















