అమెరికా న్యూ జెర్సీలోని ఎడిసన్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహా ఏర్పాటుకు ఆ నగర మేయర్ సామ్ జోషి అంగీకరించినట్లు నార్త్ అమెరికన్ సీమ ఆంధ్ర అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ కార్యకమాన్ని కో ఆర్డినేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆయన శత జయంతి సందర్భంగా విగ్రహ స్థాపనకు సన్నాహాలు చేస్తున్నామని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.