
బుర్కినా ఫాసో దేశానికి భారత తదుపరి రాయబారి గా ఓం ప్రకాష్ మీనా నియమితులయ్యారు. త్వరలో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఓం ప్రకాష్ మీనా 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీగా కూడా పని చేశారు.
















