Namaste NRI

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్‌ రిలీజ్

తరుణ్‌భాస్కర్‌ నటిస్తున్న తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఏఆర్‌ సజీవ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. హాస్య ప్రధానంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ ఆవిష్కరించారు. కోనసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో ఓంకార్‌ నాయుడు పాత్రలో చక్కటి కామెడీ పండించారు తరుణ్‌భాస్కర్‌. కలకత్తాలో చేపలని జలపుష్పాలు అంటారు. మీ పుష్పాలు నా చెవిలో పెట్టకండి అంటూ గోదావరి యాసలో ఆయన చెప్పిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. తరుణ్‌భాస్కర్‌-ఈషా రెబ్బా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: జైక్రిష్‌, నిర్మాణ సంస్థ: యస్‌ ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ స్టూడియోస్‌, రచన-దర్శకత్వం: ఏ.ఆర్‌.సజీవ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events