అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న భారతీయ కాన్సులేట్ ను ఖలీస్తానీ వేర్పాటువాదులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం ఖండించింది. దౌత్య కేంద్రాలను కానీ, విదేశీ దౌత్యవేత్తలపై అటాక్ చేయడం సరికాదు అని అమెరికా పేర్కొన్నది. విధ్వంసాన్ని, హింసను ఖండిస్తున్నట్లు ఆ దేశం తెలిపింది. కాన్సులేట్‌లో చెలరేగిన అగ్నిని శాన్ ఫ్రాన్సిస్‌కో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆర్పివేసింది. అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు.
గత మార్చిలో కూడా శాన్‌ఫ్రాన్సిస్కో దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. ఈ వరుస సంఘటనలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. భారత్ భాగస్వామ్య దేశాలైన కెనడా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ తరహా అతివాద భావ జాలానికి తావివ్వకూడదని , అది దేశాల మధ్య సంబంధాలకు మంచిది కాదని వ్యాఖ్యానించారు.