Namaste NRI

జనవరి 1న సర్కారు నౌకరి

సింగర్‌ సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం సర్కారు నౌకరి. భావన కథానాయిక.  గంగనమోని శేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్యసాయి శ్రీనివాస్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సామాజిక సమస్యలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వినోదంతో పాటు చక్కటి సందేశం కూడా ఉంటుంది. నేటి యువతకు కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలుంటాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. జనవరి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: శాండిల్య, సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: గంగనమోని శేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events