Namaste NRI

ఈ నెల 18న ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ

యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ. తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రేలంగి నరసింహారావు రూపొందించారు. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దర్శకుడిగా రేలంగి గారికి 76వ చిత్రమిది. హైదరాబాద్‌తో  పాటు కాశ్మీర్‌లోని  అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఫస్ట్ కాపీ చూసుకున్నాక చాలా సంతృప్తికరంగా అనిపించింది అన్నారు.  రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ సినిమా రాలేదు. మంచి కథ ఈ సినిమాకు కుదిరింది. విజయం అందుకుంటామనే నమ్మకం ఉంది అన్నారు. ఈ నెల 18న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events