సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రానికి మా నాన్న సూపర్ హీరో అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. సుధీర్ బాబు సరసన ఆర్నా కథానాయికగా నటిస్తోంది. ఫాదర్స్‌డేను పురస్కరించుకొని ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి లూసర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. వి సెల్యులాయిడ్, సీఏఎమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తెలిపారు. సాయిచంద్, షాయాజీషిండే, రాజు సుందరం, శకాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: జై క్రిష్, నిర్మాత: సునీల్ బలుసు. ఈ మాన్సూన్ లో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.


