అమెరికాలో తెలుగు వారి ఖ్యాతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకొంటున్నవేళ, అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగర మేయర్ జెఫ్ చేనీ ఓ కీలక ప్రకటన చేశారు. తెలుగు ప్రజలంతా అన్నగారిగా భావించే ఎన్టీఆర్ జయంతి (మే 28) నాడు ఫ్రిస్కో సిటీ తెలుగు హెరిటేజ్ డే గా మేయర్ ప్రకటించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకొంటున్నందున తమ తరపున ఆయన గౌరవార్ధంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు మేయర్ తెలిపారు.



