
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. పెన్సిల్వేనియా లోని జాన్స్టౌన్ లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు వేదికవైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ స్టేజ్పై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు వేగంగా స్టేజ్ వైపు దూసుకొచ్చాడు. దాదాపు మీడియా పాయింట్ వరకూ వచ్చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల 16వ తేదీ కూడా ట్రంప్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్పై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నా యి. ట్రంప్ భద్రతపై రిపబ్లికన్ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
