అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ గా రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ జాన్సన్ మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఎన్నికలు జరగ్గా, మైక్ జాన్సన్‌కు 218 ఓట్లు అనుకూలంగా 215 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఇద్దరు ప్రతిపక్ష సభ్యులు సైతం ఆయనకే ఓటు వేశారు. దాదాపు రెండు గంటల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మైక్ జాన్సన్‌కే మద్దతు తెలిపారు. దీంతో ఈ ఎన్నికల్లో జాన్సన్ విజయం సాధించారు. ఆ తర్వాత స్పీకర్‌గా మైక్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మైక్ జాన్సన్ మాట్లాడుతూ ఇది నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం. మన దేశ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ సమయం అని పేర్కొన్నారు. మరోవైపు మరోసారి స్పీకర్‌గా ఎన్నికైన మైక్ జాన్సన్‌కు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు.