జమ్మూలో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలు మరోసారి భగ్నం చేశాయి. జమ్మూలోని అఖ్నూర్‌లోని పలన్‌వాలా లో నియంత్రణ రేఖకు దగ్గరలో ఆర్మీ, జమ్మూ పోలీసుల సంయుక్త బృందం ఆయుధాల క్వాష్‌ను స్వాధీనం చేసుకున్నది. పలన్‌వాలా సమీపంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌లో అనుమానాస్పద బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బాక్స్‌ను తెరిచి చూడగా, ఆయుధాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు.
సరిహద్దుల ఆవల తిష్ట వేసిన ఉగ్రవాదులు డ్రోన్లను ఉపయోగించి ఈ ఆయుధాలను సరిహద్దులు దాటించారని పేర్కొన్నారు. ఆయుధాలు స్మగ్లర్లు, ఉగ్రవాదులకు అందక ముందే వాటిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నది. బాక్సులో బ్యాటరీ అమర్చిన ఐఈడీ, ఒక పిస్టల్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, 38 బుల్లెట్లు, 9 హ్యాండ్ గ్రెనేడ్లు లభ్యమైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఖౌడ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయుధాల బాక్స్ దొరికిన పరిసరాల్లోనూ పోలీసులు సోదాలు చేపట్టారు. పలన్‌వాలా ప్రాంతానికి ఆనుకుని ఉన్న మార్గాల్లో నిఘాను పెంచారు.