కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గతేడాది జులైలో ప్రమాదవశాత్తు కిందపడంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు ఆయన్ను స్థానిక ఆసుపత్రులోని ఐసీయూలోని చేర్చారు. వైద్యులు డయాలిసిస్‌తో పాటు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తు వచ్చారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుది శ్వా విడిచారు. ఫెర్నాండెజ్ మరణం ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉడిపిలో 1941 మార్చి 27న జన్మించిన ఆస్కార్ ఫెర్నాండేజ్ కాంగ్రెస్ స్థానిక విభాగం సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.
2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. 1980 దశకంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా, 1989 నుంచి 1999 వరకూ కేపీసీసీ సభ్యుడిగా ఉన్నారు. 1980లో తొలిసారిగా 7వ లోక్‌సభకు ఉడిపి నియోజకవర్గం నుంచి ఎన్నిక్యయారు. 1984, 1989, 1991,1996లో తిరిగి ఎన్నికయ్యారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఫెర్నాండెజ్ మృతికి ప్రధాని మోదీ, సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.