Namaste NRI

చరిత్ర సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌.. నాటు నాటు  పాటకు ఆస్కార్‌

అర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కు ప్రతిష్టాత్మక అస్కార్ అవార్డు లభించింది. ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి , గీత రచయిత చంద్ర బోస్ లు అందుకున్నారు.. అస్కార్ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ట్రిపుల్ అర్ చరిత్ర సృష్టించింది. చంద్ర బోస్ రాసిన ఈ గీతాన్ని కాల బైరవ, సిపిగంజ్ ఆలపించారు. ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీ అందిచారు.    ఆర్.ఆర్.ఆర్. చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది.

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ నాటు నాటు పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది.

వరల్డ్  వైడ్‌గా 81 పాటలు ఆస్కార్‌కు  ఎంట్రీ ఇవ్వగా, తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు  షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్గన్:మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్‌కు  పోటీ పడగా, నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events