ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై జంటలు ఓయోలో రూమ్ తీసుకోవాలంటే వారి పెళ్లి చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా సరే రూమ్ బుక్ చేసుకునే సమయంలో తమ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. సరైన ఐడీ ప్రూఫ్స్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించాలని తమ పార్టనర్ హోటల్స్‌కు ఓయో సూచించింది. ఈ నిబంధన మొదట మీరట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభం కానుంది. అక్కడ వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ చెక్‌ఇన్ పాలసీని మిగతా నగరాల్లో అమలు చేయనున్నారు.