పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే… పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం.. దీంతోపాటు ప్రతీ నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం.మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి అని ముఖ్యమంత్రి ఆకాక్షించారు.





