గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ని ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మానందం నేను పేరుతో ఇటీవల తన ఆత్మకథను వెలువరించారు. ప్రస్తుతం ఈ పుస్తకానికి చక్కటి పాఠకాదరణ లభిస్తున్నది. ఈ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని అగ్ర హీరో రామ్‌చరణ్‌కు బహూకరించారు బ్రహ్మా నందం. తన అత్యద్భుత జీవిత ప్రయాణాన్ని బ్రహ్మానందం ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారని, విలువైన జీవిత పాఠాలను అందించడంతో పాటు సరదాగా నవ్విస్తూ, అలనాటి సినిమా సంగతులను గుర్తుచేస్తూ ఆయన ఆత్మకథ మనోరంజకంగా సాగిందని రామ్‌చరణ్ అన్నారు.
