ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్యం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు ఐరాస భద్రతా మండలిని కోరారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ 140 దేశాలవారు సంతకాలు చేసిన దరఖాస్తును సమర్పించారు. కానీ, ఆ వినతిని ఈ సారి కూడా అమెరికా అడ్డుకునే అవకాశం ఉన్నది.
