Namaste NRI

కబ్జ నుండి పల్లి పల్లి.. బెల్లం పల్లి

ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ కబ్జ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ విడుదలై ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను  రాబట్టుకున్నాయి. ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ మూడో పాటగా పల్లి పల్లి బెల్లం పల్లి.. అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ  పాటను దర్శకుడు, నిర్మాత ఆర్.చంద్రు తన హోం టౌన్ షిడ్ల గట్టలో విడుదల చేశారు. భారీ ఎత్తును ఈవెంట్‌ను నిర్వహించి ఆడియెన్స్ సమక్షంలోనే ఈ సాంగ్‌ను   రిలీజ్ చేశారు. శాండిల్ వుడ్ కింగ్ శివ రాజ్‌కుమార్  చేతుల మీదుగా పాట విడుదలైంది. ఈ పాట పక్కా మాస్ సాంగ్. ఉపేంద్ర, తాన్యా హోప్ ఈ పాటలో నర్తించారు. హెల్త్ మినిష్టర్ కె.సుధాకర్, మాజీ మంత్రి హెచ్.ఎం.రెవన్న, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఆనంద్ పండిట్, కోప్రొడ్యూసర్ అలంకార్ పాండియన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పునీత్ రాజ్‌కుమార్  జయంతి సందర్భంగా మార్చి 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా  గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events