అనుపమ పరమేశ్వరన్ మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం పరదా. ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగు ల దర్శకత్వం. ఈ చిత్రాన్ని శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, కాన్సెప్ట్ వీడియోను అగ్ర నాయిక సమంత, దర్శకనిర్మాతలు రాజ్ అండ్ డీకే విడుదల చేశారు. ఈ సినిమాలో అనుప మ పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సంప్రదా యలంగా వోణిలో కనిపిస్తున్నది అనుపమ పరమేశ్వరన్. కాన్సెప్ట్‌లో వీడియోలో యత్ర నార్యస్తు పూజ్యంతే అనే ప్రసిద్ధ శ్లోకం వినిపిస్తున్నది. దీనిని బట్టి స్త్రీ ఆత్మగౌరవాన్ని చాటే కథాంశమిదని అర్థమవుతున్నది. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే బలమైన భావోద్వేగా లను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నా మని, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలో తీసుకెళ్లే కథ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్ సేన్, సంగీతం: గోపీసుందర్, దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల.