Namaste NRI

ఛార్లెట్‌లో పరిటాలశ్రీరామ్‌ ప్రసంగం అద్భుత స్పందన

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌ పర్యటనను పురస్కరించుకుని నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి అభిమానులు, పరిటాల అభిమానులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ చేసిన ఉత్తేజకరమైన ప్రసంగం అందరినీ ఉత్సాహపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పాలన వల్ల రాష్ట్ర ప్రగతి బాగా దెబ్బతిందని అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు ఎన్నారైలు గట్టిగా ప్రయత్నించాలని పరిటాల శ్రీరామ్‌ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐటీ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా ఎంతో మంది ఎన్‌అర్‌ఐ లుగా స్థిరపడడానికి దోహదం చేశాయని చెబుతూ, వచ్చే ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఎన్నారైలంతా ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని పురుషోత్తమ చౌదరి గూడె, రవి నాయుడు, సచ్చింద్ర ఆవులపాటి, ఠాగూర్ మల్లినేని,వెంకట్ సూర్యదేవర, మహేష్ సూరపనేని, నాగ పంచుమర్తి, కృష్ణ మెడమనూరి, నరసింహ, పురుషోత్తమ, వెంకట్ మాలపాటి తదితరులు సమన్వయ పరిచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events