మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్ర కుమార్తె పేటోంగ్టార్న్ థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ పదవి నుంచి దిగిపోవడంతో, 37 ఏళ్ల పేటోంగ్టార్న్ అభ్యర్థిత్వానికి పాలక ఫ్యూ థాయి పార్టీ నేతలు, సంకీర్ణ భాగస్వాములు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఓటింగ్ ద్వారా ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది.

దీంతో థాయ్‌కి రెండో మహిళా ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా షినవత్ర కుటుంబం నుంచి మూడో ప్రధానిగా, దేశంలో అతిపిన్న ప్రధానిగా కూడా పేటోంగ్టార్న్ రికార్డు సృష్టించారు. మొదట ఆమె తండ్రి తక్సిన్, ఆ తర్వాత ఆమె బాబాయి యింగ్లక్ షినవత్ర ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. వారి తర్వాత ఆ కుటుంబం నుంచి తక్సిన్ కుమార్తె థాయ్‌లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
