పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహరవీరమల్లు. నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ధర్మం దే విజయం అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌ను గుర్తు చేస్తూ పవన్ కల్యాణ్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేకర్స్. విక్టరీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పవన్ కల్యాణ్, అభిమాను ల కోసం విడుదల చేసిన నయా పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. క్రిష్ హరిహరవీరమల్లు ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేయగా, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్.

ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హరిహరవీరమల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రానుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.















