Namaste NRI

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది.దర్శకుడు హరీష్‌ శంకర్‌ భావోద్వేగాలు, యాక్షన్‌తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్‌ను రూపొందించారు. ఈ చిత్రానికి ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచే ఈ అత్యంత పవర్‌ఫుల్‌ సీక్వెన్స్‌కు నబకాంత మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. పవన్‌ కళ్యాణ్‌ అత్యుత్తమ ప్రదర్శనతో ఈ సీక్వెన్స్‌ అద్భుతంగా వచ్చిందని మేకర్స్‌ తెలిపారు.

 ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్థిబన్‌, కె.ఎస్‌.రవికుమార్‌, రాంకీ, నవాబ్‌ షా, కేజీఎఫ్‌ ఫేమ్‌ అవినాష్‌, నాగ మహేష్‌, టెంపర్‌ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

Social Share Spread Message

Latest News