పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వం. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ పంజా లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కూడా షూట్‌లో జాయిన్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ప్రకాష్ రాజ్ జాయిన్ అయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


