జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని పోచంపల్లి ప్రాంతంలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ వద్దకు పవన్ వెళ్లి చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరీ మధ్య ఏపీలో రాజకీయ పరిస్థితులు, ప్రచార హోరు, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన పార్టీకి ఫండ్ కింద చిరంజీవి రూ. 5 కోట్లు విరాళం అందజేశారు. ఆయన వెంట మరో సోదరుడు నాగబాబు కూడా ఉన్నారు. అనంతరం లొకేషన్‌లోనే ముగ్గురు అన్నదమ్ములు కొంతసేపు సంభాషించుకున్నారు. ఇంకా పలువురు జనసేన నాయకులు కూడా చిరంజీవిని కలిసినవారిలో ఉన్నారు.