Namaste NRI

పెద్ది ఫస్ట్‌ సింగిల్‌.. చికిరి చికిరి వచ్చేసింది

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ రస్టిక్‌ యాక్షన్‌ డ్రామా పెద్ది. జాన్వీకపూర్‌ కథానాయిక. బుచ్చిబాబు సానా దర్శకుడు. సతీష్‌ కిలారు నిర్మాత. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని చికిరి చికిరి సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. బాలాజీ రాసిన ఈ పాటను ఏ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరచగా, మోహిత్‌ చౌహాన్‌ ఆలపించారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ పాట చిత్రీకరణ విషయానికొస్తే, పర్వత ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రామంలో తన చికిరి(జాన్వీకపూర్‌)ని చూశాడు. ఆమె అందం, అమాయకత్వం అతడ్ని మంత్రముగ్ధుడిని చేశాయి. ఆమెను చూసిన తన్మయంలో పెద్ది ఈ పాట పాడతాడని మేకర్స్‌ తెలిపారు.

ఆ చంద్రుడ్లో ముక్క.. జారిందే నీలెక్క. నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా అంటూ సాగే ఈ పాటలో రామ్‌చరణ్‌ రాకింగ్‌ డాన్స్‌ మూమెంట్స్‌, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌, రిథమ్‌, హ్యాపీనెస్‌ హైలైట్‌గా నిలుస్తాయని, ఆయన హుక్‌ స్టెప్‌ ఇప్పటికే వైరల్‌గా మారిందని, సినిమాలో జాన్వీకపూర్‌ ఎంట్రీలో ఈ పాట వస్తుందని, ఆమె దీపాన్ని ఎత్తి తన లుక్‌ని రివీల్‌ చేసే సీన్‌ మ్యాజిక్‌లా ఉంటుందని మేకర్స్‌ పేర్కొన్నారు. శివరాజ్‌కపూర్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, నిర్మాణం వృద్ధి సినిమాస్‌, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌.

Social Share Spread Message

Latest News