Namaste NRI

డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమెరికా 47వ దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన రిప‌బ్లిక‌న్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఉన్న వాణిజ్య బంధాన్ని గుర్తు చేశారు. ట్రంప్ తొలి ద‌శ పాల‌న స‌మ‌యం లో ఆయ‌న‌కు మోదీ మ‌ధ్య‌ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ జ్ఞాప‌కాల‌ను మోదీ నెమ‌రేసుకున్నారు. 2019 సెప్టెంబ‌ర్‌లో హూస్ట‌న్‌లో జ‌రిగిన హౌడీ మోడీ ఈవెంట్‌ను కూడా ప్ర‌ధాని మోదీ గుర్తు చేశారు. 2020 ఫిబ్ర‌వ‌రిలో న‌మ‌స్తే ట్రంప్ పేరుతో అహ్మ‌దాబాద్‌లో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అమెరికా, భార‌త్ మ‌ద్య వూహాత్మ‌క భాగ‌స్వామ్యం గురించి మాట్లాడారు. టెక్నాల‌జీ, ర‌క్ష‌ణ‌, ఎన‌ర్జీ, అంత‌రిక్ష రంగాల‌తో పాటు ఇత‌ర రంగాల్లోనూ సంబంధాల‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఇద్ద‌రూ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News