ఆరేండ్ల వయసులోనే పోలియో బారిన పడి 72 ఏండ్లు ఒక ఇనుప యంత్రంలో జీవించిన పాల్ అలెగ్జాండర్ (78) కన్నుమూశారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్‌కు 1952లో పోలియో కారణంగా పక్షవాతం వచ్చింది. మెడ నుంచి కింద భాగం పని చేయకుండా పోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆయన సహజంగా ఊపిరి తీసుకోలేడని వైద్యులు గుర్తించి, కృత్రిమంగా ఊపిరి అందేలా ఒక భారీ యంత్రం లో ఆయనను పెట్టారు. ఒక పెద్ద పెట్టెలా కనిపించే ఈ యంత్రం బరువు దాదాపు 270 కిలోలు ఉంటుంది. ఈ యంత్రంలోనే ఆయన కాలేజీకి వెళ్లి చదువుకొని న్యాయవాది అయ్యారు. పలు పుస్తకాలు రాశారు. పోలియో పాల్‌గా ఆయన కథ ప్రఖ్యాతి గాంచింది.
