Namaste NRI

ప్ర‌భాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం … ఒకే బ్యాన‌ర్‌తో

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇప్ప‌టికే వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ను లైన్‌లో పెట్టిన డార్లింగ్ తాజాగా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ టాప్ బ్యాన‌ర్‌తో 3 ప్రాజెక్ట్‌ల‌ను సంత‌కం చేశాడు. నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్  తాజాగా ప్ర‌భాస్‌తో బంఫ‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. ప్ర‌భాస్‌తో ఒక్క సినిమా తీస్తేనే అదృష్టం అనుకుంటు న్న స‌మ‌యంలో ఏకంగా మూడు ప్రాజెక్ట్‌ల‌ను ఒప్పందం చేసుకుంది. అవును 2026 నుంచి 2028 వ‌ర‌కు ప్ర‌భాస్‌తో మూడు భారీ ప్రాజెక్ట్‌లు ఉండ‌బోతున్న‌ట్లు హోంబాలే ఫిలింస్ ప్ర‌క‌టించింది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ల‌లో భాగ‌మ‌వుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏడాదికో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాం. ముందుగా స‌లార్ 2 రాబోతుంది అంటూ హోంబాలే వెల్ల‌డించింది. దీన్ని బ‌ట్టి చూస్తే, ప్ర‌భాస్ మ‌రో నాలుగు సంవ‌త్స‌రాలు ఫుల్‌ బిజీగా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే మారుతితో రాజా సాబ్ చేస్తున్న ప్ర‌భాస్ దీని అనంత‌రం హ‌ను రాఘ‌వ‌పూడితో ఫౌజీ చేస్తున్నాడు. ఇవే కాకుండా లైన్‌లో స‌లార్ 2, క‌ల్కి 2, స్పిరిట్, ప్ర‌శాంత్ వ‌ర్మ చిత్రాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events