Namaste NRI

ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం మూవీ ప్రారంభం

అశోక్‌రాజ్‌, రితికా రాజ్‌, శ్రష్టి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రచండ తరుణం కాఠిన్య కావ్యం. ఈ చిత్రం  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బాల పులిబోయిన దర్శకుడు. పులిచర్ల నాగరాజు, రామచంద్ర, కొల్లకుంట నాగరాజు నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి కన్నడ హీరో సిద్ధార్థ్‌ క్లాప్‌నిచ్చారు.

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ  అంతా కొత్తవాళ్లతో ఈ సినిమా చేస్తున్నాం. మన పురాణాలు, ఇతిహాసాల్ని నేటి శాస్త్ర సాంకేతికతకు మేళవించి ఓ ఫ్యూజన్‌ జోనర్‌ను పరిచయం చేయబోతున్నాం. ఇదొక కొత్త ప్రయత్నం  అన్నారు. వినయ్‌ బిడ్డప్ప, ఉగ్ర మంజు, రవితేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నిరంజన్‌దాస్‌, సంగీతం: పీఆర్‌, నిర్మాణ సంస్థలు: శ్రీహర్షిత మూవీస్‌, కళా మూవీ మేకర్స్‌, దర్శకత్వం: బాల పులిబోయిన.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress