సదన్, ప్రియాంకప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రణయ గోదారి. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. సాయికుమార్, పృథ్వీ, జబర్దస్త్ రాజమౌళి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలోని గు గు గ్గు అనే ప్రత్యేక గీతాన్ని కొరియోగ్రాఫర్ గణేష్ విడుదల చేశారు. ఈ పాటకు మార్కండేయ స్వరాలను సమకూర్చడంతో పాటు సాహిత్యాన్ని అందించారు. భార్గవి పిైళ్లె ఆలపించింది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తున్నదని, అందమై న ప్రేమకథగా అందరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాని కి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్.