మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రీతి కన్నప్ప ఇష్టసఖి, చెంచుల యువరాణి నెమలి పాత్రలో నటిస్తుంది. అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్వం.. కన్నప్పకి సర్వస్వం చెంచుల యువరాణి నెమలి అంటూ ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది.