
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ప్రేమంటే.థ్రిల్-యూ ప్రాప్తిరస్తు అనేది ఉపశీర్షిక. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు నిర్మాతలు. రానా దగ్గుబాటి సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. తాజాగా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదని, కథనం ఈ సినిమాకు ప్రధానబలంగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: లియోన్ జేమ్స్, నిర్మాణం: ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ, స్పిరిట్ మీడియా.
