ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నాయి. సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరపనున్నట్టు ఆయన ప్రకటించారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి దాటాక యూఏఈకు చేరుకున్నారు. భారీ మానవీయ సహాయ కార్యక్రమం నిమిత్తం తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. మరోవైపు కొన్ని రోజుల్లో అమెరికారష్యామధ్య సౌదీ అరేబియాలో ఉక్రెయిన్పై శాంతి చర్చలు జరగనున్నాయి. ఈమేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో , పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కోష్, జాతీయ భద్రతా సలహాదారు మైక్వాల్జ్ సౌదీకి ప్రయాణమయ్యారు.
ఇక ఉక్రెయిన్ లేకుండానే ఈ చర్చలు చేపట్టడంపై అమెరికా మిత్రదేశాల నుంచి అసంతృప్తులు రావడంతో ట్రంప్ స్పందించారు. యుద్దాన్ని ముగించే ఏ చర్చలోనైనా జెలెన్స్కీ భాగస్వామి అవుతారని ట్రంప్ వివరణ ఇచ్చారు. చాలా తొందరలో రష్యా అధినేతతో తాను భేటీ కానున్నట్టు చెప్పారు. ఆయన ఫ్లోరిడా లోని డెటోనా రేసులో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
