ఆర్థిక సంస్కరణల రూపకర్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. మన్మోహన్ నివాసానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ము, అక్కడ మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ప్రధాని ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.